1, నవంబర్ 2024, శుక్రవారం

2-38: సాంఖ్య యోగము. 38వ శ్లోకము

శ్లో|| సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ||(2-38)||

టీక:- సుఖదుఃఖే = సుఖదుఃఖములను; లాభాలాభౌ= లాభనష్టములను; జయాజయౌ = జయాపజయములను; సమే కృత్వా=  సమముగ దలచి; తతః= అటుపిమ్మట​; యుద్ధాయ = యుద్ధమునకై; యుజ్యస్వ= సిద్ధపడుము; ఏవమ్ (చేత్)= అటుల చేసితివేని; పాపమ్= పాపము; న అవాప్స్యసి= పొందవు.

భావము: అర్జునా! సుఖదుఃఖము లందును జయాపజయము లందును లాభనష్టము లందును సమబుద్ధిని కలిగి యుద్ధమునకు సంసిద్ధుడ వైతివేని నీవు పాపమును పొందకుందువు గాక​!

వ్యాఖ్యానము: 31 నుండి 38 వరకు గల శ్లోకములలో భగవానుడు ఆనాటి దేశ కాల సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పెద్దవానిగా అర్జునునకు యుద్ధము చేయుటయే మానవునికి గల ఓకే ఒక వ్యవసాయము అని సెలవిచ్చెను. ఇక్కడ యుద్ధము అనగా దౌర్జన్యముతో కూడిన చేష్టగా కాక చేపట్టగల కార్యమునకు ఉద్యుక్తుడవు కమ్ము అని తీసుకొనవలెను.

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి