టీక:- యామ్
ఇమాం = ఇవన్నీ; పుష్పితాం=ఆకర్షణీయమైన; వాచం =
మాటలు; ప్రవదంతి=విశేషించి
చెప్పుదురో; అవిపశ్చితః
= పరిమితమైన అవగాహన కలవారు;
వేదవాదరతాః=వేదములోని
ఫలశృతి మీద ఆసక్తి కలవారు;
పార్థ=
అర్జునా; న అన్యత్
అస్తి = ఇంతకంటే వేరేది ఏదీ లేదు;
ఇతి = ఈ
విధంగా; వాదినః =
వాదిస్తారు;
శ్లో|| కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ ।
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ||(2-43)||
టీక:- కామ-ఆత్మానః
=ఇంద్రియ సుఖములపై ఆసక్తితో;
స్వర్గ-పరాః
= స్వర్గమును పర లోకములను పొంద గోరి; జన్మ-కర్మ-ఫల =జన్మము, కర్మము, అవి ఇచ్చు
మంచి ఫలములను; ప్రదాం = ఇచ్చే;
క్రియా-విశేష
బహులాం = అనేక డాంబికమైన కర్మ కలాపములతో కూడిన యట్టి; భోగైశ్వర్యగతిం ప్రతి = భోగములు ఐశ్వర్యములు సంపాదించుటకు;
శ్లో|| భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ||(2-44)||
టీక:- భోగైశ్వర్యప్రసక్తానాం =
భోగములు, విలాసము లందు మిక్కిలి
మమకారాసక్తి ఉన్నవారికి; తయా= దాని వలన; అపహృత = అపహరించబడిన; చేతసామ్ =మనస్సు గలవారు;
వ్యవసాయాత్మికా
= వ్యవసాయము చేయుటకు అనువైన, కృషిచేయుటకు తగినది, ప్రయత్నము చేయ తగినది,
సాగు
చేయుటకు అనుకూలమైనది, దృఢమైన నడవడి; బుద్ధిః= బుద్ధి; సమాధౌ= సమాధి నిష్టలో,
దైవధ్యానములో; నవిధీయతే — సాధ్యము కాదు,
కలుగనేరదు.
మూడు శ్లోకాల భావము: ఓ అర్జునా! వేదములలో చెప్పబడిన
ఫలములను తెలుపు భాగములందు ఆసక్తి; అందు చెప్ప బడిన స్వర్గాది ఫలితముల కంటే
అధికమైనది వేరేదియూ లేదని వాదించు వారును, విషయ వాంఛలతో నిండిన చిత్తము
కలవారును; స్వర్గాభిలాషులగు అల్పజ్ఞులు జన్మము, కర్మము, తత్ఫలాపేక్షులును
భోగములు ఐశ్వర్యములు సంపాదించుటకై అనేక డాంబికమైన కర్మ కలాపములతో కూడిన ఫలశూన్యమగు
ఏ వాక్యమును చెప్పుచున్నారో దానిచే అపహరించబడిన చిత్తము కలవారికి, భోగైశ్వర్యప్రియులకును సమాధి నిష్టలో, దైవధ్యానందు
పాల్గొనుటకు దృఢమైన చిత్తము కలుగనేరదు.
వ్యాఖ్యానము:
వ్యవస్థీకృత మతములన్నీ ఇహలోకము, పరలోకములను
వేరు చేస్తూ, అనేకానేక రకాలుగా మనిషికి ఆశ చూపో, బెదిరించో అతనిని సన్మార్గంలో పెట్టడానికి
స్వర్గము (=ఆశ, సుఖము, తృప్తి) లేదా నరకము
(= బెదిరింపు, శిక్ష, కష్టము) సృష్టించాయి.
తాత్కాలికంగా
అవి ఉపయోగపడినా, వాస్తవానికి
అవేవీ కూడా సాధారణ మనిషికి నిశ్చయ వివేకం లేక
పోవడముతో అతని ప్రవర్తన మీద ఏమాత్రము దీర్ఘకాలిక ప్రభావం
చూపించలేకపోయాయి. (ఇంతకు ముందటి శ్లోకములో
2-41లో చెప్పినట్లు నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానము అనేక భేదాలతో అనంత
ముఖాలుగా వుంటుంది). మనిషి బుద్ధి కుక్కతోక
వంకర లాగే ఉంటుంది.
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి