2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము. 2-58వ శ్లోకము

శ్లో|| యదా సంహరతే చాయం కూర్మోఽఙ్గానీవ సర్వశః
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
||(2-58)||  

టీక:-  యదా = ఎప్పుడు; అయం = ఈతడు (యోగి); కూర్మః = తాబేలు; అఙ్గానీవ = అవయవములను; ఇన్రియార్థేభ్యః = ఇంద్రియ విషయముల నుండి (శబ్దస్పర్శాదులనుండి), ఇంద్రియాణి = ఇంద్రియములను; సర్వశః చ = అన్నివైపులనుండియు; సంహరతే = వెనుకకు మరల్చుచున్నాడో, (తదా = అప్పుడు); తస్య = అతని యొక్క; ప్రజ్ఞా = జ్ఞానము; ప్రతిష్ఠితా = మిగుల స్థిరమైనది.

భావము:   తాబేలు తన అవయవములను లోనికిముడుచుకొనునట్లు, యోగి యెపుడు తన ఇంద్రియములను శబ్దస్పర్శాదుల లగు విషయములనుండి సర్వత్ర వెనుకకు మరల్చుచున్నాడో, అపుడాతని జ్ఞానము మిగుల స్థిరమైనది యగును. (ఆతడు స్థితప్రజ్ఞుడగును).

వ్యాఖ్యానము:

ఓపిక, సహనము: తాబేలు ఉదాహరణ చాలా ముఖ్యమైనది. నెమ్మదితనమునకు, సహనమునకు ప్రతీక​. మనమున్న పరిస్థితులు ఒక రకముగా చెప్పాలంటే యుద్ధ రంగాన్ని తలపిస్తాయి. తనపై దాడి జరుగుతుంటే సహనముతో తట్టుకుని,  ఓపికగా తాబేలు వలె నిలిచి తన అవయవములను వెనుకకు తీసినట్లుగా కేవలము తనను ప్రేరేపిస్తున్న ఇంద్రియములను వెనుకకు మరల్చ వలెనని ఆదేశము.

జీవితముపై మన అధికారమేమి?: మనం జీవితంపై నియంత్రణ ఎందుకు కోరుకుంటాం? మొదటి చూపులో, ఈ ప్రశ్న సాధారణమైనదిగా, పనికిరానిదిగా అనిపించవచ్చు. అయినప్పటికీ మానవ చరిత్రలో అనేక మంది మనస్సులను కలవరపరిచి, చీకాకుపరచిన ప్రాథమిక విచారణపై దృష్టి సారించవలెను. ఇప్పుడు ముందుగా జాన్ మిల్టన్ రాసిన సానట్ 19తో ఈ శ్లోకమును పోల్చి మరింత విశదపరచుకుందాము. దీని భావాన్ని ప్రతిబింబిస్తూ క్రింద తెలుగులో కూడా వ్రాసి ఉంచాను.

When I consider how my light is spent:

 

When I consider how my light is spent,
   Ere half my days, in this dark world and wide,
   And that one Talent which is death to hide
   Lodged with me useless, though my Soul more bent
To serve therewith my Maker, and present
   My true account, lest he returning chide;
   “Doth God exact day-labour, light denied?”
   I fondly ask. But patience, to prevent
That murmur, soon replies, “God doth not need
   Either man’s work or his own gifts; who best
   Bear his mild yoke, they serve him best. His state
Is Kingly. Thousands at his bidding speed
   And post o’er Land and Ocean without rest:
   They also serve who only stand and wait.”
                                                                        -జాన్ మిల్టన్

స్వేచ్ఛానువాదం: ధ్యేయం

 

జీవితం ఎలా గడిచిందో నేను ఆలోచించినప్పుడు
సగం రోజులు ఈ నిడివైన​ చీకటి ప్రపంచంలో
నాకున్న ఒక ప్రతిభకు మరణం అడ్డుతున్నప్పుడు
నా ఆత్మ మరింత కోరుతున్నప్పటికీ
ప్రతిభ నాతో వుండి కూడా పనికిరానిదైంది
సృష్టికర్తకు సేవ చేయడానికి మరియు
నా నిజమైన హృదయాన్ని సమర్పించడానికి
అతను నా పై తిరిగి కోపించకుండా
దైవమిచ్చిన ఈ అవకాశానికి కొంత బదులుగా సమర్పించుకోవాలా? ఇకపై వెలుగును చూడలేనా?" అని అనుమానంగా నాలో నేనే గొణిగాను.

నాలో నేను పాలుపోక వుంటే, నా మౌనాన్ని పటాపంచలు చేస్తూ వెంటనే సమాధానం,

దేవునికి మనిషి నేర్పరితనములు గాని, బహుమానములు గాని అవసరం లేదు;

అతడి తేలికపాటి కావడిని ఎవరు నిరుత్తరంగా భరిస్తారో, వారు ఆయనకు ఉత్తమంగా సేవ చేస్తారు.

అతని రాజ్యం మహోన్నతమైనది.

కానీ వేలమంది విశ్రాంతి లేకుండా భూమిని మరియు సముద్రాన్ని త్రవ్వుతున్నారు అతడి అనుజ్ఞకై. ​

అతనివెంబడి మౌనంగా నిలబడి వేచి ఉన్నవారు కూడా సేవ చేస్తున్నట్లే.
                                                                                          -జాన్ మిల్టన్
(కావడి=cross, శిలువ​)

మౌన సమ్మతము: ఈ కవితలో చెప్పినట్టు మానవునికి దైవమిచ్చిన ఈ జీవితమును మౌనంగా "నాకే ఇన్ని పరీక్షలా?"  అను సందేహాలను కట్టిపెట్టి మౌనంగా నిర్లిప్తంగా ఎటువంటి ప్రతిక్రియలు లేకుండా జీవితము సాగించటమే ఉత్తమము అని తెలుస్తున్నది. అన్నమాచార్యులు లోకరంజకము తమలోని సమ్మతము అన్న దాని అర్థం కూడా ఇదే.

తమలోనిసమ్మతము మనిషి తనతో తాను అంతర్గతముగా సహవాసము చేయలేక పోవుటయే జీవితములోని అసౌకర్యమునకు కారణము. అందుకు ఉన్నదానిని ఉన్నట్లుగా సమ్మతించక సర్దిచెప్పుకుపోవు ప్రయత్నములు చేసెదము. ఇది కొనుగోలు చేసిన సంధి​. దీనికి మూల్యము చెల్లించక తప్పదు. 

అంతరంగ సామరస్యము: తమలోనిసమ్మతము అంతరంగ సామరస్యమునకు దారి. అంతరంగములో లేని సామరస్యము బాహ్యముగా ఎంత ప్రయత్నించినా సమకూరదు. ఆ సామరస్యము పరిశుద్ధమైన అంతఃకరణములేక సాధించుటెట్లు?  కనపడునది కనపడినట్లుగా అంగీకరించుటకు, మౌనము, ప్రశాంతత లేక సాధ్యమా? దానిని ప్రభావితము చేయు  మలినములను పూర్వానుభవముల జాడలు ప్రక్కకు త్రోచివైచుటెట్లు?  

నిర్మలమైన మనస్సు: తమలోనిసమ్మతము అనగా  నిర్మలమైన అంతరంగముతో, స్థిరుడై (అటునిటు చూడక), సమస్త కార్య కలాపములు నిగ్రహించువాడై, మౌనియై నిర్వర్తించువానికి మాత్రమే సాధ్యము. భగవద్గీతలో “అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః । సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ।। 12-16 ।।“ అని పేర్కొన్నది యిదియే. 

లోకరంజకము: అటు వంటి సూక్ష్మబుద్ధిగల ద్రష్టలు లోకరంజకము కాక మరేమి

x-x-x-x


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి