టీక:-
అర్జున= అర్జునా; వేదా=
వేదములు; త్రైగుణ్యవిషయా=
త్రిగుణాత్మక విషయములను తెలిపినవి; (త్వమ్= నీవు); నిస్త్రైగుణ్యః:
త్రిగుణములను విడిచినవాడవు (కమ్ము); నిర్ద్వంద్వః= ద్వందములు
లేనివాడవు (కమ్ము);
నిత్యసత్త్వస్థః=
నిరంతరము శుద్ధ సత్వమును పాటించువాడవు (కమ్ము); నిర్యోగక్షేమ= యోగక్షేమములను
పట్టించుకొనక; ఆత్మవాన్ =
ఆత్మ జ్ఞానివి; భవ= కమ్ము.
భావము: ఓ అర్జునా
వేదము లందలి పూర్వభాగములు కర్మకాండములు, త్రిగుణాత్మకములగు సంసార విషయములను తెలుపుచున్నవి. నీవు త్రిగుణములను
వదిలిన వాడవు; ద్వందములలో చిక్కుకొనని వాడవు; నిరంతరము శుద్ధసత్వమును ఆశ్రయించిన వాడవు; యోగక్షేమములపై దృష్టిలేక
ఆత్మజ్ఞానివియు కమ్ము.
వ్యాఖ్యానము:
అసాధ్యమైన కల్పన:: ఇక్కడ యోగక్షేమముల ప్రస్తావన ఎందుకు తీసుకుని రాబడినది? దేహము ద్వారా మన భౌతిక దేహము, మనస్సు, ఆత్మ అన్నీ కూడా ఒక చోట చేర్చి వుంచబడినవి. వీనికి విడిగా అస్థీత్వములేదు. మన ప్రస్తుత స్థితిలో అనేకానేక విషయాలపై మనకు స్పష్టమైన నిశ్చితమైన అభిప్రాయములు ఏర్పరుచుకొని ఉంటాం. అలాగే భౌతిక దేహము కూడా (విషయములు) కొన్నింటిని సంతోషంగా స్వీకరించ సంతోషముగా స్వీకరించి ఇంకొన్ని ఘాటుగా తృణికరించును.
'ఇష్టము' 'కష్టము': ఈ స్వీకార తృరణికారాలకు ఆధారమేదీ లేదు. కేవలం 'ఇష్టము' 'కష్టము' అను రెండు ధృవముల మధ్య ఏర్పరచుకున్న అభిలాషలు. వీటిని త్యజించుట సులభమైన విషయం కాదు. ఆ యోగ మార్గమున ఎంతోకొంత యోగ క్షేమముల విషయమై ఇచ్చిపుచ్చు కోవాల్సివుంటుంది. మనకి ఇష్టమైనవి సులభంగా గ్రహిస్తాం. కష్టం అనుకున్నవి మనస్పూర్తిగా స్వీకరించలేము. ఇక్కడే పేచీ అంతా!
ద్వందములు: ప్రకృతి నిర్మించిన ఈ దేహము గురించి మనకేది మంచిదో మనకు ప్రకృతి కంటే ఎక్కువ తెలుసు అనుకోవడం కూడా అజ్ఞానమే. ఈ రకముగా ప్రకృతి విధించు అనుశాసనమునకు నూటికి 100% అనుజ్ఞ ఇవ్వలేము. ఇదియే ద్వందములలో చిక్కుకోవడం.
బైబిల్ తో సారూప్యం: ఇప్పుడు బైబిల్ లో పేర్కొన్న కింది వాక్యమును చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి “ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును; నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించు కొనును.” (ముత్తయి 16:24-26).
ఇక్కడ నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని
చెప్పిన దానిని "సాధకుడు తన
సుఖమును, రక్షణను పరిగణించకయే భగవద్ధ్యానము నందు ఉంటాడని"
పరిగణించవలెను. మన మనసులను అనేక సందేహాలు తొలగి వేస్తుంటే ధ్యానము అటకెక్కుతుంది.
మనసులో సంకోచం విడిచి భగవంతుని వెంబడించువాడు పుణ్యుడు.
x-x-x-x
1.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి