శ్రీ
భగవానువాచ ।
శ్లో|| ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||(2-55)||
టీక:- పార్థ
= ఓ అర్జునా!; యదా = ఎల్లప్పుడూ; మనోగతాన్=
మనస్సునందుండెడు;
సర్వాన్ =
సమస్తములైన; కామాన్=
కోరికలను; ప్రజహాతి=
వదలివేయుచున్నాడో;
ఆత్మన్యేవ =
తన ఆత్మయందే; ఆత్మనా=
ఆత్మచే ( ఆత్మ నవలంభించిన మనస్సుచే); తుష్టః= తృప్తిని పొందినవాడై; తదా=
అప్పుడు; స్థితప్రజ్ఞః
(ఇతి) = స్థితప్రజ్ఞుడని (నిశ్చలమైన బుద్ధి గలవాడని); ఉచ్యతే=
చెప్పబడుచున్నాడు.
భావము: ఓ అర్జునా ఏ మానవుడు తన మనస్సు
నందున్నట్టి కోరికలన్నింటిని సంపూర్ణముగా వదలివేయునో మరియు ఆత్మయిందే ఆత్మచే (అనగా
నిర్మల చిత్తముతో) నిరంతరము సంతృప్తిని పొందుచుండునో అప్పుడు ఆతడు స్థితప్రజ్ఞుడని
అని పిలువబడును.
వ్యాఖ్యానము:
Part1:
నిజంగా కోరికలు వదలివేయగలమా?: చిక్కంతా కూడా కోరికలన్నింటిని సంపూర్ణముగా వదలివేయుటయే. క్రింది అన్నమాచార్యుల కీర్తనలోని ఒక చరణము చూడండి. కోరికలను వదలిన వాని చిత్తము కూడా అలాగుననే గిజగిజ లాడును.
సొమ్ము వోవేసినవాఁడు చుట్టి చుట్టి వీధులెల్లా
కమ్మర వెదకీనట కన్న దాఁకాను
నమ్మిన ఆజ్ఞానములో నన్నుఁ బడ వేసికొని
అమ్మరో వూరకుందురా అంతర్యామీ ॥నన్ను॥
ముఖ్యపదములకు అర్ధములు: సొమ్ము = material
acquisition; వోవేసినవాఁడు
=పోగొట్టుకున్నవాడు; నమ్మిన ఆజ్ఞానము= belief that I know, నాకు తెలుసు అనే
నమ్మకం; పడ వేసికొని= తనను తాను చిక్కించుకొని,
entrenching oneself; అమ్మరో
= exclamation, నివ్వెరపోతున్నాడు; వూరకుందురా = ఏమీ చేయకుండా
ఊరకుందురా?
భావము: మనం ఏదైనా సొమ్ము పోగొట్టుకుంటే అది పోగొట్టుకున్నచోట తచ్చాడుతూ
తిరుగుతూ అక్కడ పడేవేసితినా ఇక్కడ పడేవేసితినా అని గుర్తు చేసుకుంటూ, మన
శక్తులన్నీ కూడగట్టుకుని వీధులన్నీ తిరిగి వాటిని తిరిగి పొందేవరకు మనం ఎంత క్లేశము
చెందుతాము? నాకు తెలుసును అనే నమ్మకంతో తనను తాను చిక్కించుకొని ఏమి చేయకుండా భగవంతుడిపై
భారం వేసి ఉండగలుగుతాడా మానవుడు?
Part2:
చక్కెరవిలుకానికి
చిక్కితిమి: ఇంకా అన్నమాచార్యుల క్రింది పల్లవిని కూడా
పరికించండి.
కల
దింతె మాఁట కంతుని యాఁట
తెలుసుకో
నీలోనిదియె పూఁటపూఁట ॥పల్లవి॥
భావము:
మన ప్రపంచం అంతా మన్మధుని లీలయే. నీలో ఈ
ఎడతెగని కార్యకలాపాలను పూట పూటకు గమనించుటయే నీ విధి. నేర్వవలసినది ఇది ఒక్కటే.
సార్వత్రిక
ప్రేరణ: ఈ పల్లవి మన మనసులను నిర్దేశించు దానిని తెలుపుతున్నది దీనిని గమనించక
మనం చేపట్టు కార్యములన్నియు అజ్ఞానంలోకి వచ్చును అనునది స్పష్టము. “సెక్స్ (ప్రణయము) అనేది మనందరికీ
ప్రధాన ప్రేరణ మరియు సార్వత్రిక హారము. అత్యంత వివేకంతో, స్వచ్ఛంగా
కనిపించే వ్యక్తులు కూడా వారి లైంగిక కోరికలకు మరియు వ్యక్తీకరణకు వ్యతిరేకంగా చాలా
కష్టపడవచ్చు” అని విశ్వ విఖ్యాతి నందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు
అన్నారు.
Part3:
స్వభావస్తు ప్రవర్తతే: మనము దేనితో చేయబడిన వారమో అదియే మనలను నిర్దేశించు చున్నది. ఈ రకంగా ప్రకృతికి ఒడబడి మానవుడు
కార్యములు చేపట్టును. దీనిపై రెనే మాగ్రిట్టే గారు వేసిన “ద కల్టివేషన్ ఆఫ్ ఐడియాస్”
అను పేరు గల 1928వ సంవత్సరపు అధివాస్తవిక చిత్రము ద్వారా మరి కొంత విశదపరచుకుందాం.
విత్తుటకు సిద్ధముగా క్షేత్రము: కల్టివేషన్ ఆఫ్ ఐడియాస్ (విత్తుటకు సిద్ధముగా ఉన్న వ్యవసాయ క్షేత్రము): ఇది ఒక ప్రకృతి దృశ్యము చూపుతున్నట్లు అనిపిస్తుంది. రెండు కాండములు లాగా కనపడును. వానిపై భాగములు శిఖరములో కలిసిపోయినట్లు ఉండి ఒక మనిషిని తలపింప చేయుచున్నవి. అస్పష్టంగా ఉన్నటువంటి ఆకుల గుంపులు మన మనసులో మెదలాడు ఆలోచనలు లేదా చుట్టూత వుండు వాతావరణముతో (మనకు అవగాహన లేని) పరస్పర చర్యలతో పోల్చవచ్చు. అయినప్పటికీ ఆ చెట్లు (ఆ మనిషి) ఒక కృత్రిమమైన చదును నేలపై నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఆకులతో కప్పబడి ఉన్న పై శరీరభాగము మానవ్ని మానవుని అస్పష్టమైన భావనలకు, అటువంటి భావనలు జనియించు క్షేత్రమునకు ప్రతీకలు.
వారు కొట్టుకుపోతున్నారు: ఆ కనపడుతున్న మానవుని ముందురి క్షేత్రము నీలము ఆకు పచ్చ కలిగి
ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో అస్పష్టంగానూ, రంగుల మిశ్రమంతో మారుతున్న క్రమముగా మారుతున్న
రంగుల మిశ్రమంతో పోను పోను అది గోధుమ రంగుల ఒక నదిలా అనిపిస్తుంది. ఆ బొమ్మ నుండి దూరంగా పోతున్నకొద్దీ అది కణములు కణములుగా (grainy flow) ఒక ప్రవాహంలాగా మారుతుండటం చూడవచ్చు. ఆ చెట్లను (ఆ మనిషిని)
ఒక కృత్రిమమైన చదును నేలపై నిలబెట్టి; “ఆ నదిలో తాను తప్ప
తక్కినవారందరూ కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తుంది” అని సూచించారు.
కలయో, మాయయో: నిద్ర
నుండి మెలుకువలోనికి వచ్చుచూ, అతడు పూర్తిగా స్పృహలో
లేనప్పుడు ఒక వ్యక్తి అనుభూతి చెందగల వాతావరణాన్ని చిత్రం చూపిస్తుంది. ఒక రకమైన మంత్రముగ్ధతను, చెప్పలేని
అనుభూతిని మన మనసులలో వుంచుతుంది; కలలలో తనను సమ్మోహనము
(హిప్నోటైజ్) గావించిన దృశ్యమును తిరిగి పునర్నిర్మాణము చేయునటు వంటి అనుభవమునకు కొంత
దగ్గరగా అనిపింప చేస్తుంది.
అనియంత్రిత ప్రవేశము: కలల ద్వారా సమ్మోహనము
చేయబడి చేయబడినటువంటి ఒక భ్రమను కలిగిస్తుంది, ఈ అద్భుతమైన చిత్రంతో రెనే మాగ్రిట్టే మనలో చెలరేగు వూహలు ఆలోచనలు మనకు తెలియకనే జీవులన్నింటినీ (మనుషులను) ఆవరించియున్న అలోచనా తరంగములతో ఏర్పడిన
నదివంటి దానిలో భాగమైపోతాము అని చెప్పారు. ఎవరికి వారు తాను తప్ప మిగిలిన వారందరూ
బ్రాంతికి గురి అవుతున్నారు అనిపిస్తుంది.
కోరిక సార్వజనిక సూత్రము: ఈ రకముగా మానవుల అందరి ఆలోచనా విధానములు సార్వజనిక తరంగములతో
కలుపబడి దానికి అనుగుణముగా ప్రవర్తించుటకు ఉద్యమిస్తాడు ప్రపంచమంతటినీ
చుట్టిముట్టి ఉన్న ఈ ఆలోచన తరంగములు ముఖ్యముగా కామ ప్రధానములై ఉండును.
నిరంతర అప్రమత్తత: భగవద్గీత, రెనే మాగ్రిట్టే
గారు, అన్నమాచార్యులు గారు, ఒకే విషయాన్ని చెబుతున్నారు అని నిర్ధారణ
చేసుకోవచ్చు. ఈ విధముగా పైపైకి మనం స్వతంత్రముగాఁ యోచనలు చేయుచున్నట్లు కనపడినాను అంతర్గతముగా
మనము స్వతంత్రులము కాము. అందుకే అన్నమాచార్యులవారు “తెలుసుకో
నీలోనిదియె పూఁటపూఁట” అని హెచ్చరించారు. అనగా మన జీవితమంతా వీని పట్ల అప్రమత్తతతో ఉండవలెను అని సూచన.
నీవు
వారి లాగే: భీష్మించుకుని
కూర్చున్నప్పటికీ, మన్మధుని ప్రేరణతో కలిగిన ఆలోచనలు మనలను మనం ఉన్న స్థితి నుండి కూకటి
వేళ్లతో సహా పెకిలించి ప్రవాహం వెంబడి తీసుకు పోవుచున్న {“నీవు
కూడా అందరి లాగానే కొట్టుకుపోతున్న”} సంగతి
గమనించగలవా ?
వాస్తవమును
అంగీకరించుము: అన్నమాచార్యులు మానవులందరూ
ప్రణయము లేదా కామము అను వానిలో కొట్టుకొనిపోవుచున్నారని;
ఎవరు దానికి మినహాయింపు కాదని; ఈ సత్యం తమలో తాము గ్రహించు
వారికి సత్యం వైపు నడుచుటకు అవకాశం కలదని చెబుతున్నారు.
x-x-x-x

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి