శ్లో|| ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు ।
బుధ్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ||(2-39)||
టీక:- పార్థ
= ఓ అర్జున; సాంఖ్యే=
అత్మతత్త్వ విషయములందు;
ఏషా= ఈ
ప్రతిపాదింపబడిన;
బుద్ధిః = జ్ఞానము; తే= నీకు; అభిహితా=
చెప్పబడినది; యయా
బుధ్ధ్యా= ఎట్టి వివేకముతో;
యుక్త=
కూడినవాడవై; కర్మబంధం =
కర్మబంధమును; ప్రహాస్యసి=
వదలగలవో; (తామ్=
అట్టి); యోగేతు=
కర్మయోగ విషయము; ఇమామ్= ఈ
చెప్పబోవు నిశ్చయమును;
శృణు=
వినుము.
భావము: అర్జునా!
ఇంత వరకు సాంఖ్య శాస్త్రంలో చెప్పబడిన ఆత్మ తత్వ నిశ్చయమును తెలిపితిని. ఇక
యోగశాస్త్రమునందలి కర్మ యోగసంబంధమైన విశేషములను నీకు తెలుపబోతున్నాను, అద్దానిని ఎఱింగినచో నీవు కర్మ బంధములనుండి పదిలముగా విముక్తుడవు కాగలవు.
కాబట్టి శ్రద్ధతో ఆలకింపుము.
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి