2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము. 2-61వ శ్లోకము

శ్లో|| తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
||(2-61)||

టీక:-  తాని = ఆ యింద్రియములను, సర్వాణి = అన్నిటిని, సంయమ్య = చక్కగావశపఱచుకొని, యుక్తః = సమాధిస్థితి (మనఃస్థిరత్వము) గలవాడుగను, మత్పరః = నాయందా సక్తమైన చిత్తముగలవాడుగను, ఆసీత = ఉండవలెను, హి = ఏలననగా, యస్య = ఎవనియొక్క, ఇంద్రియాణి = ఇంద్రియములు, వశే = స్వాధీనమందు (వర్తనే = ఉన్నవో), తస్య = ఆతనియొక్క, ప్రజ్ఞా = జ్ఞానము, ప్రతిష్ఠితా = సుస్థిరమైనది ( భవతి = అగుచున్నది).

భావము(బలవత్తరములగు) అట్టి యింద్రియములన్నిటిని చక్కగా వశపఱచుకొని సాధకుడు మనఃస్థిరత్వము గలవాడై (సమాధి స్థితిని చేరినవాడై) నాయందే (అంతర్యామి యందే) ఆసక్తి గల్గియుండును. ఏలననగా, ఎవని యింద్రియములు స్వాధీనమునందుండునో, ఆతని జ్ఞానమే సుస్థిరమై ప్రకాశించగలదు.  

వ్యాఖ్యానము: See commentary of 2-70

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి