2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము. 2-57వ శ్లోకము

|| యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
||(2-57)|| 

టీక:- యః = ఎవడు, సర్వత్ర = సమస్తవిషయములందును; అనభిస్నేహః = అభిమానములేనివాడై; తత్తత్ = ఆయా; శుభాశుభమ్ = ప్రియము, అప్రియము తెలుపు (శుభాశుభ) విషయములను; ప్రాప్య = (ఒకవేళ) పొందినను; నాభినందతి = సంతోషింపడో; న ద్వేష్టి = ద్వేషమునుబొందడో; తస్య = అట్టివాని; ప్రజ్ఞా = జ్ఞానము; ప్రతిష్ఠితా = మిక్కిలి స్థిరమైనది ( అట్టివాడు స్థితప్రజ్ఞుడని భావము).

భావము:   ఎవడు సమస్తవిషయములందును (దేహ, బంధు, భోగాదులందు) అభిమానము లేకయుండునో, ఆ యా ప్రియాప్రియములు సంభవించినను సంతోషమునుగాని, ద్వేషమునుగాని బొందకుండునో, అట్టివాని జ్ఞానము మిగుల స్థిరమైనది యగును (అట్టివాడే స్థితప్రజుడు).

వ్యాఖ్యానము: రుడ్యార్డ్ కిప్లింగ్ అనే ప్రఖ్యాత బ్రిటిష్ కవి, 'స్థిత ప్రజ్ఞత' గూర్చి ఉన్న ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని తన ఈ 'If' అనే ప్రసిద్ధమైన గీతము​లో పొందుపరిచాడు. ఆ కవిత నుండి కొన్ని పంక్తులు ఇవిగో:

If you can dream—and not make dreams your master;
If you can think—and not make thoughts your aim,
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same…
If neither foes nor loving friends can hurt you,
If all men count with you, but none too much:
If you can fill the unforgiving minute
With sixty seconds’ worth of distance run,
Yours is the Earth and everything that’s in it,
And—which is more—you’ll be a Man, my son!


 స్వేచ్ఛానువాదం: ఐతే

నువ్వు కలలు కనగలిగితే –

ఐతే ఆ కలలు నీకు యజమానిగాకుంటే;

నువ్వు ఆలోచించగలిగితే  -

ఐతే ఆ ఆలోచనలు నీ లక్ష్యం కాకుంటే,

నీకు విజయమో మరియు విపత్తో గలగవచ్చు –

ఐతే వారిద్దరు ఒకరికి మరొకరు ప్రతిరూపంగా వ్యవహరించే వేషగాళ్ళని చూడగలిగితే: 

నువ్వు మాట్లాడినది శత్రువులను లేదా ప్రియమైన స్నేహితులను బాధించకపోతే,  

ఎక్కువ తక్కువలులేని యోగ్యులందరిలో నిన్నులెక్కపెట్టవచ్చు;

భరించరాని, క్షమించలేని ఘడియలను పరుగు పందెములతో నింపగలిగితే,

ఈ ప్రపంచము, ఈ జీవితమూ అందులోనిదంతా నీదే

అంతే కాదు అబ్బాయీ నువ్వో మొనగాడివి

 

ఆత్మ అంతర్గత స్వభావం: శ్రీ కృష్ణుడు చెప్పినది రుడ్యార్డ్ కిప్లింగ్  చెప్పినది ఒకే విధంగా ఉండడం యాదృచ్ఛికం కాదు; నిజానికి జ్ఞానోదయ వాంఛ అనేది ఆత్మ యొక్క అంతర్గత స్వభావం. అందుకే, ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లో ఇది ప్రతిబింబిస్తుంది. (హోలీ భగవద్గీత నుండి తీసుకొన బడినది)

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి