2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము. 2-60 వ శ్లోకము

శ్లో|| యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః
||(2-60)||

 

టీక: - కౌత్తేయ=ఓ అర్జునా! యతతః అపి = (ఆత్మావలోకనము కొఱకు) ప్రయత్నము చేయుచున్నవాడైనను; విపశ్చితః = విద్వాంసుడైనను (శాస్త్రజ్ఞానముగల); పురుషస్య = పురుషునియొక్క; మనః =మనస్సును; ప్రమా థీని = క్షోభము గలుగజేయునట్టి; ఇన్రియాణి = ఇంద్రియములు; ప్రసభమ్ =బలాత్కారముగ; హరన్తిహి = లాగుచున్నవిగదా!

భావము: ఓ అర్జునా! ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలననిన, ఆత్మావలోకనముకొఱకు యత్నించుచున్నట్టి విద్వాంసుడగు మనుజునియొక్క మనస్సును గూడ నయ్యవి బలాత్కారముగ  విషయములపైకి లాగుకొని పోవుచున్నవి.

వ్యాఖ్యానము: See commentary on 2-67

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి