1. అపరిమితమైన
దుఃఖము కీలక ఘట్టములలో సంభవించును (2-2).
2. మనో దుర్బలత్వంచే మానవులు నిర్వీర్యులగుచున్నారు(2-3).
3. పండితులైనవారు
జీవనమును మరణమును ఒకే విధంగా స్వీకరించుదురు. (2-11)
4. మానవులకు శాశ్వతత్వం పొందు అవకాశం ఉంటుంది.(2-12).
5. ఏది విశ్వమంతటను
వ్యాపించి ఉన్నదో, అవ్యయమగు దానిని వినాశము చేయులేరు. అప్రమేయుడు దేహము నందున్నాడు.
కానీ దేహములు నాశవంతములు కావున ఆ స్థితి నుండి తెలియబడడు (2-17).
6. జీవన్మరణముల చక్రములు మానవుల ముందుంచిన అతి
క్లిష్టమైన పరీక్షలు (2-27).
7. మానవుడు ఈ జీవ
మున్న చిన్ని కాల వ్యవధి అందే తాను పొందిన అవకాశమును సార్థకం చేసుకొనవలెను (2-28).
8. మానవులు చేపట్టుటకు ఒకే ఒక మార్గం కలదు (2-41). తక్కినవన్నీ అపమార్గములు.
9. సమత్వంలో
స్థితుడై ఉండుట ఒకటియే పేర్కొనబడినది (2-48).
10. కర్మ ఫలమును గోరువారు అల్పులు (2-49).
11. ఆ
మార్గాన్వేషణమున భోగైశ్వర్యముల యొక్క ప్రసక్తి ఉండదు. స్వర్గనరకములు, పుణ్యపాపముల ప్రసక్తి ఉండదు. నిష్కామకర్మ ఒక్కటియే సూచించబడినది (2-50).
12. (శబ్దాది)
విషయములు ఎండగొట్టుటవలను, దూరముగా ఉంచుట వలనను తొలగుటలేదు.
అవి కేవలము సత్య దర్శనం వలననే తొలగుచున్నవి. (2-59).
13. ఇంద్రియముల
చర్యలు జీవులందరి మీద ఒకే విధమైన ప్రభావం చూపించును. అప్రమత్తత లేక జీవులు బాధలను పడుతున్నారు. (2-68).
14. మన ఎదుటి ప్రపంచము విలోమ దర్పణంలా పనిచేయుచు
పరీక్షించు చున్నది. యోగులు జీవనమును తెలియుటలోను; జీవులు విషయములు
అనుభవించుటలోనూ సమయం వెళ్ళబుచ్చుదురు (2-69).
15. ఆ గంభీరమైన
స్థితికి చేరినప్పుడు లోపలి/వెలుపలి విషయములు మానవుని బాధింపలేవు.
(2-70)
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి