శ్లో|| ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ।
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ।। 65 ।।
టీక:-
ప్రసాదే = మనోనైర్మల్యము (చిత్తశాంతి) కలుగగా; అస్య = ఇతనికి,
సర్వ దుఃఖానామ్ = సమస్తదుఃఖములయొక్కయు;
హానిః = వినాశము; ఉపజాయతే = కలుగుచున్నది;
ప్రసన్న చేతసః = నిర్మలమనస్సు గలవానికి;
బుద్ధిః= బుద్ధి; ఆశు = శీఘ్రముగ; పర్యవతిష్ఠతి హి= (పరమాత్మయందు) స్థిరముగ నిలుచునుగదా!
భావము: మనోనిర్మలత్వము కలుగగా దానివలన
మనుజునకు సమస్తదుఃఖములున్ను ఉపశమించిపోవు చున్నవి. నిర్మలమనస్కునకు బుద్ధి
శీఘ్రముగ (పరమాత్మయందు) స్థిరత్వమును జెందుచున్నది.
శ్లో|| నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ ।। 66 ।।
టీక:-
అయుక్తస్య = ఇంద్రియనిగ్రహము లేనివానికి (ఇంద్రియములను, మనస్సును అరికట్టలేని వానికి); బుద్ధిః = వివేక ముతో కూడిన
బుద్ధి; నాస్తి = కలుగదు; అయుక్తస్య = ఇంద్రియనిగ్రహము
లేనివానికి; భావనాచ =ఆత్మచింతనయు; న =
కలుగనేరదు; అభావయతః = ఆత్మచింతనలేనివానికి; శాంతిః చ = శాంతియు;, న =కలుగదు; అశాస్తస్య = శాంతిలేనివానికి; సుఖమ్ = సుఖము;
కుతః = ఎక్కడిది?
భావము: ఇంద్రియనిగ్రహము, మనస్సంయమము లేనివానికి వివేకబుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు.
ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివానికిక సుఖమెచట?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి