శ్లో|| దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ ।
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ||(2-49)||
టీక:- ధనంజయ = ఓ అర్జునా!; బుద్ధియోగాత్ = సమత్వబుద్ధితో గూడిన నిష్కామ కర్మముకంటె; కర్మ = ఫలాపేక్షతో గూడిన కామ్యకర్మము; దూరేణ = మిక్కిలి; అవరంహి = తక్కువగదా!; (కాబట్టి) బుద్ధౌ = (ఆ) సమత్వ బుద్ధియందు, శరణమ్ = ఆశ్రయమును, అన్విచ్ఛ = అభిలషింపుము, ఫలహేతవః = ఫలమును గోరువారు, కృపణాః = అల్పులు (దీనులు).
భావము: ఓ అర్జునా!
(పైన దెల్పిన) సమత్వబుద్ధితో గూడిన నిష్కామకర్మకంటె ఫలాపేక్షతో గూడిన కామ్యకర్మ
విలువలేనిది గదా! కావున సమత్వరూపమైన అట్టి నిష్కామ కర్మ అనుసరించు బుద్ధినే నీ వాశ్రయింపుము.
కర్మ ఫలమును గోరువారు అల్పులు.
వ్యాఖ్యానము:
Refer the
commentary on the next poem.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి