టీక:- శ్రుతివిప్రతిపన్నా
= నానావిధ శ్రవణాదులచే కలతజెందియున్న, తే= నీయొక్క, బుద్ధిః=
బుద్ధి, యదా=
ఎప్పుడు, నిశ్చలా =
చలింపనిదై, సమాధౌ = పరమాత్మ
ధ్యానమందు, అచలా =
స్థిరముగ, స్థాస్యతి = నిలిచియుండునో, తదా =
అప్పుడు, యోగమ్ =
యోగమును (భగవదైక్యమును,
ఆత్మసాక్షాత్కారమును), అవాప్స్యసి
= పొందగలవు.
భావము: నానావిధములగు శ్రవణాదులచే కలతజెందియున్న నీబుద్ధి యెపుడు చలింపనిదై పరమాత్మధ్యానమందు స్థిరముగ నిలిచియుండునో, అపుడు నీ వాత్మసాక్షాత్కారమును (=సంపూర్ణమైన యోగ స్థితిని) బొందగలవు.
వ్యాఖ్యానము:
47 నుండి 53
వరకు గమనించిన,
మానవులకు చేయుటకు ఏమియు లేదు అను విషయమును,
సమత్వమును
పాటించి వుండుటను.
పాప పుణ్య ములను తర్కము త్యజించి వుండుటను.
వినినది, వినబోయేదాని
వలన దుఃఖము పొందకుండుటను వివరించిరి.
అలౌకకానుభవము: వీని నుండి, ఆ పేర్కొన్న స్థితి కాలమునకు అతీతమైనదని, అనుభూతికి అందనిదని, మనము వూహించగల దేనితోను పోలి
వుండదని, దానిని దర్శించిన వారు పాపపుణ్యముల విచారణలో
ప్రవేశించరని తెలియుచున్నది.
వ్యాఖ్యానము దుస్సాహసము: అట్టి స్థితిని గురించి వ్యాఖ్యానించుట సామాన్యులైన మనకు దుస్సాహసమే. కావున దానిపై వచ్చిన వివరణలను ఆ దృష్టితో చూచి విడువవలెను. అది తర్కము స్పృశించలేని ఎత్తులో వున్నది. అందుకే తర్కము, కారణములు మనుష్యులకు అడ్డు గోడలు. అవి వూహించ గలదాని మితికి చిహ్నములు. అవి ప్రపంచమును తిరో మార్గమును పట్టించినవను వ్యాఖ్య అసమంజసము కాదు.
థర్మోమీటర్ వంటి సుచిక: సువాసనతో నిండిన గదిలో ప్రవేశించన వెంటనే దానిని తెలియుదుము. అటుపిమ్మట సువాసనకు అలవాటుపడిన మనకు దాని స్పృహ వుండదు. హెచ్చుతగ్గులు లేని సువాసనను మనము గుర్తించలేము. ఆ రకముగా మనకున్న ఎఱుక కేవలం స్థితిలోని మార్పులకు (థర్మోమీటర్ వంటి) సుచికయే కానీ జ్ఞానము కాజాలదు.
రహస్యము: అటులనే జ్ఞానులు తాము ఆ అపూర్వ స్థితికి చేరితిమని తెలియలేరు. వారు మన స్థితికి చేరుకున్న తరువాత ఆ స్థితిని గూర్చి తెలుపలేరు. అందువలననే అది రహస్యముగా వుంచబడినది. సామాన్యులము, మనమా రహస్యమును ఛేదించ జాలమని వదలి వేయుట పిరికితనము. అట్లని, తెలిసిన యే మార్గము దానికి బాట కాదని గుర్తించి, ఆ నిత్య నూతన సత్యమునకు క్రొంగొత్త దారిని నిర్మించుటయే ఈ జీవనమునకు సాఫల్యము. తక్కిన వన్నీ ఖేదమునకు, మరింత కృషికి, ప్రయాసమునకు, శ్రమకు, మరణమునకు బాటలు.
ఆలోచించండి: ఈ వివరణలను మీ ముందు వుంచుతున్నది, వీనిని స్వీకరించమని కాదు. వీని గురించి ఆలోచించండి. స్వీకరించ తగని వానిని త్యజించమని మనవి.
ఈ రకముగా భగవద్గీతలోని ముఖ్య
ప్రతిపాదనలను తెలుసుకున్నాము. ఇక మీదట వచ్చు అన్ని శ్లోకములు వీని నాధారము చేసికొని
చెప్పినవే. అందుకే వీటిని అతి సూక్ష్మముగా, అతి నిశితంగా తెలుసుకొనవలెను.
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి