20, ఏప్రిల్ 2024, శనివారం

రెండవ అధ్యాయము. సాంఖ్యయోగము: ఒక పరిచయము.


భగవద్గీత సారం  సాఙ్ఖ్యయోగము: భగవద్గీత సారాన్ని ఈ సాఙ్ఖ్యయోగములో నిక్షిప్తం చేసి ఉంచారు. ఇందులో కన్నీళ్లు ఊబికి వస్తున్న అర్జునుని చూచి కృష్ణ పరమాత్మ అతడు చేస్తున్న పని ఆర్యులకు తగనిదనిఅది కేవలము హృదయ దౌర్బల్యం అని సూచించినా అర్జునుడు తగ్గకుండా తాను యుద్ధం ఎందుకు చేయరాదో శ్రీకృష్ణుడికి సహేతుకంగా చెప్పబోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి సేనల మధ్యలోనే నిలిచి జ్ఞానమును బోధిస్తాడు. దానినే భగవద్గీత అని చెప్పుకుంటున్నాము.

మన జ్ఞానము అజ్ఞానము: ముందుగాతానేమి చేయాలో తానే నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్న అర్జునుడు జ్ఞానిలా యుద్ధమున ప్రతిపక్షంలోని వీరులతో బాంధవ్యము గురించియుద్ధ పర్యవసానము గురించి చేసిన వ్యాఖ్యలు ఊహాత్మకములే కావున వాటి గురించి మాట్లాడుట కృష్ణుడు సరికాదనెను 11వ శ్లోకములో.

జననమరణ రహస్యమే జ్ఞానము: భగవానుడు ఎటువంటి సందేహములకు తావివ్వకుండా, "విజ్ఞులు బ్రతికున్నవారి గురించి కానిమరణించినవారి గురించి కాని దుఃఖింపరు" అని ఆనతిచ్చెను. అనగా విజ్ఞులైన వారు చురుకుదనము లేని జడమతులు కారని,  జనన మరణములను సమముగా చూడ గలిగిన​ సూక్ష్మ బుద్ధి గలవారని భావించవచ్చును. అనాదిగా మానవుడు పరిష్కరించలేని  ‘చావు’ ‘పుట్టుక’ అను రెండే రెండు ధర్మములు కలవువీనిని సాధించినవాడే  పండితుడని ముందుగానే తెలియ చెప్పినది. 

పట్టియుంచినదే అవరోధము: జాగ్రత్తగా గమనిస్తే అర్జునుడి మనసును పీకి వేస్తున్నటువంటి శోకమే అతనిని సరిగా చూడనివ్వకుండా అవరోధించుచున్నదని ఈ శ్లోకము యొక్క భావం. (16వ శ్లోకములోని​ తత్త్వదర్శిభిః తో అన్వయించు కొనవలెను)మన చూపులను అడ్డుకుంటున్నది ఏమియో లోతుగా విచారించినది భగవద్గీత.

కల్మషములను స్మృతులే వక్రీకరణలు: 11 నుంచి 16 దాకా ఉన్న శ్లోకములలో భగవద్గీత సారం అంతా దాచి ఉంచారుటూకీగా చెప్పాలంటే కాల గమనము మన ముందటి ప్రపంచముమన లోపలి ప్రపంచముభావోద్రేకములుఆత్రుత మన చూపుల గమనమును వక్రీకరించుచున్నవి (12, 13 14, 15 & 16). ఇవన్నీ వాతావరణంలో ధూళి కణాలు ఉన్నట్లు మన మనసులో నిక్షిప్తమై ఉంటాయిఇది గాలిలోని ధూళికణములు సూర్య కిరణములను వంగునట్లుగా చేయునట్లే ఈ కల్మషములను స్మృతులు కూడా చూపుల వక్రీకరణకు మెట్లు వేయును.

మీమాంసలు లేని సమ్మతము: ఈ రకముగా చూచినచూచే చూపులను ప్రభావితం చేయు జ్ఞాపకములకు విజ్ఞులు తావు ఇవ్వరు అని తెలియవచ్చు. అనగా వారు జరుగుతూ వున్న దానిని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించెదరు (13-30). "ఈ రకముగా జీవించుట సరిఆ మరణము ఆమోదయోగ్యము కాదు" అను మీమాంసలకు గురికారు (11).

సమముగా చూచుటయే జ్ఞానము: భగవద్గీత ముఖ్యంగా సామాన్యులు సైతం సమీక్షించగల పరిశీలనల మీదనే  ఆధారపడి ఉంటుంది. ఇందులో అంతకు మించి సిద్ధాంతములను ప్రతిపాదించ లేదు. భగవద్గీత మనముండు స్థితిని అద్దంలా పట్టి చూపుతుంది. భగవద్గీత ఆసాంతము సరిగా, సమముగా చూచుటపైననే కేంద్రీకరించును. ప్రతి యొక్కరికి సూటిగా చేపట్టదగ్గ వ్యవసాయమును వివరించును. 

కఠినమైన దృక్కోణపు సవరణ: ఇందులో చెప్పిన కార్యము లేదా యాక్షన్ అంతా ఈ చూచే చూపుల సవరణ పైనేకాబట్టి పైపైకి చెప్పినట్లు కనపడినా భగవద్గీతలోని దాదాపు అన్ని శ్లోకాలకు ఈ 11వ శ్లోకమే మూలము అని పోనుపోను తెలుస్తుందిఅయితే ఈ సవరణ కనబడినంత సులభసాధ్యముకాదుఆచరణకు అత్యంత కఠినమైన మార్గమిది.

కార్యాచరణ: తదుపరి శ్లోకములు శాశ్వతమగు దాని తత్వమునుఆ పిమ్మట అనుసరణీయమైన​ కార్యాచరణనుపండితుల మనో ధర్మమునుస్థిర బుద్ధినిఅందు నుండి బంధ విమోచన ములను వివరించిరి. ఐతే ఇవన్నియు గాఢముగాను క్లిష్టమై వుండుట చేతను వివిధములైన అన్వయములకు తావిచ్చునట్లు ఉండుటచేతను తక్కిన అధ్యాయములలో సవిస్తారముగా  వివరించిరి.

సాహసోపేతమైన ప్రయాణము: ముందుమాటలో విన్నవించినట్లు భగవద్గీత విప్లవాత్మక  ధోరణి 11వ శ్లోకము నుండి గమనించ వచ్చును. “సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా” (48) అనగా అనుకున్నది సిద్ధించినా లేక  సిద్ధింపకున్నా అని కాదు అర్ధము. సిద్ధించుట లేక  సిద్ధించకుండుట అనునవి ఒక గమ్యమును సూచించుచున్నవి. గమ్యమును నిర్ణయించి నడుచుకొనుట సామాన్యము. గమ్యమునుగమ్యమును నిర్ణయించు దానిని విడిచి నడువుమని భగవద్గీత ఆదేశము. కానీ అలాంటి సాహసోపేతమైన ప్రయాణమును విజయమే పరమావధిగా భావించు వారు అపాయకరమైనదివిపత్కరమైనది అని ముద్ర వేసి త్రోసిపుచ్చుదురు.  మానవ చరిత్రలో పూర్వమెన్నడు లేనిఆచరణ యోగ్యమైననిత్య నవీనమైనఅత్యద్భుత క్రమంలో కనుల ముందు జీమనమను దానిని సాక్షాత్కరింప చేస్తారు.

ఆకాశానికి నిచ్చెనలు: బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే (2-50 భావము:   వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును).  ఆధారమేలేని దానిని, మనకు తెలియని దానిని (దైవమును) గుర్తించుట అసాధ్యము. అద్దానిని ఏ ఆధారములతో, ఏ సిద్ధాంతములతో కనిపెట్టగలముఆ యత్నములో వుపయోగపడు పరికరములెవ్విపాపపుణ్యమలనునవి లక్ష్యమును తెలుపునవి కావున పనిజేయవు. అటువంటి స్థితిలో మానవుడు చేపట్టగల కార్యం ఏమిటి? దానిని సాధారణ తర్కముతో నిర్ణయించలేము. అందుకే భగవానుడు ఇంత విశదముగా వివరించవలసి వచ్చింది.

దైవం మాకు జ్ఞానము ఇవ్వలేదు: భగవద్గీతలో పేర్కొన్న బుద్ధిజ్ఞానముపాండిత్యమువివేకముతెలివి అన్నియూ సమానాంతర పదములు.  అన్వయమునకు అందనివే. ఈ అతి సూక్ష్మమైన దానిని "మాకు ఇటువంటి జ్ఞానము దైవం ఇవ్వలేదు"  అను ఆలోచనలను, అనుమానములను ప్రక్కన ఉంచి, ఈ దేహములోని (తనకున్న) సమస్త వనరులను వినియోగించి ప్రతి మానవుడు సాధించగలడు అన్ని భగవద్గీత సందేశము ​ (46). 

అంతుచిక్కని శాంతి: నిజానికి మానవజాతి నిరంతరముగా ప్రయత్నాలుప్రయోగాలు మరియు కఠినమైన క్రమశిక్షణలు అమలు చేసినప్పటికీ ఆ  శాశ్వతమైన శాంతి అంతుచిక్కనిదే అయినది. మనము ఈ అస్తవ్యస్త జీవితమును ఎలాగోలాగ గడిపి వెళిపోతాం. అందువల్లభగవద్గీత యొక్క నిష్కపటమైనబాహాటమైన ఉపదేశము మానవుని తనంత తానుగా ఆ  శాశ్వతమైన శాంతివైపు సమర్థవంతంగా అడుగులు వేసేలా చేస్తుంది.

వ్యర్థం చేస్తున్నదేమిటో తెలుసుకో: మనము (మన ప్రస్తుత స్థితిలో) నిత్య సంఘర్షణలలో అవివేకముగా నిమగ్నమై తేజోమయ జీవనమును అనుచితంగా పణముగా అర్పిస్తున్నామని తెలియ జేయును. మానవుని జీవన గమ్యము ఏదో సాధించుట కాదు. తనకు లభించిన ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొంటూ తనను తాను సరిదిద్దుకుంటూ ఆ అనిర్వచనీయమైన సత్యము వైపు మళ్ళి ఆ అనంతమున ప్రతిఘటన లేకయే, ‘తానను’ నిర్వచనం లేకయే అప్రతిహతంగా కలిసిపోవుట.

తానే వచ్చును దైవసహాయం: దీనిని మానవుడు స్వయంగా సాధించ లేడు (65). అట్లని  తాను చేయగలిగిన దానిని అసాధ్యమని వదల రాదు (47). ఆ అసాధ్యమును తాకుటకై చేయు యత్నము ధ్యానం. ఆ యత్నములో దైవ సహాయము లభించును. ఐతే ముందుగామన వైపు నుండి ఆ దిశలో అడుగులు పడ వలెను. వేరొండునవి ధ్యానం కావు (44).

జ్ఞానాజ్ఞానముల మధ్య సూక్ష్మ వ్యత్యాసం: ఇది కాకవేరు ఏ రకమైన అన్వయమైననూ ఏదోయొక సిద్ధాంతము యొక్క ఆవలంబము లేకుండా భగవద్గీతతో కలుపలేరు. అటువంటి జీవనము తేజోమయ జీవనము కానేరదు. ఆ సూక్ష్మమే జ్ఞానాజ్ఞానముల మధ్య వ్యత్యాసం (భగవద్గీత 8-9).

x-x-x-x

1 కామెంట్‌: