శ్రీ భగవానువాచ
శ్లో|| కుత స్త్వా
కశ్మల మిదం
విషమే సముపస్ధితం|
అనార్యజుష్ట మస్వర్గ్యం
అకీర్తికర మర్జున!|| (2-2)
టీక: శ్రీ భగవానువాచ —
పరమేశ్వరుడైన భగవానుడు పలికెను; కుతః — ఎక్కడినుండి (ఏ కారణము చేత);
త్వా — నీకు;
కశ్మలం — భ్రాంతి,
మోహము;
ఇదం — ఈ యొక్క;
విషమే — ఈ విషమ సమయంలో;
సముపస్థితమ్ —
పొందినది, దాపురించినది; అనార్య జుష్టమ్— అనాగరికమైన వ్యక్తిలతో ఆచరింపబడునది;
అస్వర్గ్యమ్ — ఉత్తమ
లోకాలకు భంగకరమైనది; అకీర్తి-కరమ్ — అపకీర్తిని కలిగించేది;
అర్జున — అర్జునా.
భావము: భగవానుడు ఇట్లనెను "అర్జునా విషమ సమయములో ఈ
దుఃఖావేశము నీకు ఎటుల దాపురించినది? ఇది శ్రేష్ఠుల చేత ఆచరింప తగనిది;
ఉత్తమ లోకములకు దారి తీయనిది మరియు అకీర్తిని కలిగించునది"
వ్యాఖ్యలు:
1. శ్రీ కృష్ణుడు మొదటి ప్రయత్నంగా అర్జునునితో క్షత్రియునికి తగని పనులు, తగని సమయములో చేయుచున్నావు. అర్జునుని సంబాళించుకుని జరగవలసిన కార్యమునకు సన్నద్ధుని కమ్మనెను.
2. ఇప్పటికీ మన ప్రాంతాల్లో ఓరి! అప్రాచ్యుడా! అని తిడతారు. కొంచెం ఆలోచిస్తే అది
పెద్ద తిట్టు. అంటే వాడు తూర్పువాడు కాదు అని అర్ధం. ఈ రకంగా చూస్తే, అనార్యుడు, అప్రాచ్యుడు ఒకే కోవకు చెందినవే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి