20, ఏప్రిల్ 2024, శనివారం

2-1: సాంఖ్య యోగము. మొదటి శ్లోకము

 

సంజయ ఉవాచ

శ్లో|| తం తథా కృపయావిష్టం
అశ్రు పూర్ణా కులేక్షణమ్|
విషీదంత మిదం వాక్యం
ఉవాచ మధుసూదనః|| (2-1)

 

టీక: తం — అట్లు ; తథా — ఆ విధంగా; కృపయా — జాలితో; ఆవిష్టం — చొచ్చినది, ఆవేశము ఆవహించినది; అశ్రుపూర్ణాకులేక్షణమ్ — కన్నీరు నిండి వ్యాకులమైన నేత్రములు గలవాడును​; విషీదంతం — దుఃఖించువాడును; ఇదం వాక్యం — ఈ (చెప్పబోవు) వాక్యమును; ఉవాచ — పలికెను; మధుసూదనః — శ్రీ కృష్ణుడు.

 

భావము: సంజయుడు కురుక్షేత్రంలో జరుగుతున్న సంఘటనలు ధృతరాష్ట్రునికి వివరంగా చెబుతున్నాడు. "ఆ విధముగా అర్జునుని కనులలో అశ్రువులు నిండి అతని వ్యాకులపాటును, శోకమును తెలుపుతున్నవి. అప్పుడు అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను".

 


వ్యాఖ్యలు:

1. తగిన సమయం రానిదే జ్ఞానం మనస్సు లోకి ఎక్కదు. అందుకే, భగవానుడు అర్జునుని పరిస్థితి తెలిసీ, ఇప్పటిదాకా మిన్నకుండెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి