శ్లో|| న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్ ।
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||(2-8)||
టీక: టీక: నహి ప్రపశ్యామి = నేను నిజముగా చూడలేకున్నాను(ఊహించలేకున్నాను); మమ — నా యొక్క; అపనుద్యాత్ — పోగొట్టే; యత్ — ఏదైతే; శోకం — శోకమును; ఉచ్ఛోషణమ్ — తపింపచేయు చేయునట్టి; ఇంద్రియాణామ్ — ఇంద్రియముల యొక్క; అవాప్య — దక్కిన తరువాత; భూమౌ — ఈ భూమిపై; అసపత్నమ్ — ఎదురులేని; ఋద్దం — సుసంపన్నమైన; రాజ్యం — రాజ్యము; సురాణామ్ — దేవతల యొక్క; అపి — అయినా; చ — కూడా; ఆధిపత్యమ్ — ఆధిపత్యము.
భావము: (కృష్ణా!!)
నాకు సర్వ భూమండలానికి ఏకచ్ఛత్రాధిపత్యం ఇచ్చినా సరే; స్వర్గాధిపత్యం
ఇచ్చినా సరే; నా సర్వేంద్రియాలను ఎండ కొట్టేస్తున్న ఈ దుఃఖం
నివారణము అయ్యేలా లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి