అర్జున ఉవాచ
శ్లో|| కథం భీష్మమహం సంఖ్యే
ద్రోణం చ మధుసూదన ।
ఇషుభి ప్రతియోత్స్యామి
టీక:-
అర్జున ఉవాచ = అర్జునుడు ఇట్లనెను,
అరిసూదన =
శత్రువులను నశింపజేయునట్టి, మధుసూదన = ఓ కృష్ణా! పూజార్హా =
పూజింపదగినట్టి, భీష్మం = భీష్ముని, ద్రోణం చ = ద్రోణుని,
సంఖ్యే =
యుద్ధమునందు, అహం = నేను, ఇషుభిః = బాణములతో,
కథం = ఎట్లు, ప్రతియోత్స్యామి = ఎదిరించి యుద్ధము చేయగలను?
శ్లో|| గురూ నహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహ లోకే
హత్వా೭ర్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్|| (2-5)||
టీక:– మహానుభావాన్
= మహానుభావు లైన, గురున్ = గురువులను, అహత్వా = చంపక,
ఇహలోకే = ఈ లోకమునందు, భైక్ష్యమపి = భిక్షాన్నమైనను, భోక్తుం = భుజించుటకు,
శ్రేయోహి
=శ్రేయముకాదా!, గురూన్ = గురువులను, హత్వాతు = చంపియో,
ఇహైవ = ఈ
లోకముననే, రుధిర ప్రదిగ్ధాన్ = రక్తముచే
పూయబడిన, అర్థకామాన్ = అర్థకామరూపములగు
(ధనసంపదలు, కామ్యవస్తువులు), భోగాన్ =భోగములను,
భుంజీయ =
భుజించువాడ నగుదును
భావము: అర్జునుడిట్లనెను-(కృష్ణా!!) "భీష్ముడు, ద్రోణుడు మొదలగు గురువులూ, మహానుభావులూ అయిన వారిమీద బాణములను ఏరకంగా సంధింప గలను? పూజ్యనీయులైన వారిని చంపి, రక్తసిక్తమైన రాజ్య సంపదలను భోగించుట కంటే ఈ లోకమున బిచ్చమెత్తుకొనియైనను జీవించుట శ్రేయస్కరము."
వ్యాఖ్యలు:
1. అర్జునుడు యుద్ధ విరమణ కోసం కారణాలు వెతుకుతున్నాడు. బిక్షాటన క్షత్రియులకు తగినది కాదు. అయినా అర్జునుడు యుద్ధాన్ని వదిలి సన్యాసం తీసుకుంటాను అన్న సంకేతం ఇస్తున్నాడు.
2. అన్యాయ పక్షమున నిలిచినందుకు వారు (ఆ గురువులు, ఆ మహానుభావులు) జీవించుటకు అర్హత కోలుపోయిరని పండితుల అభిప్రాయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి