టీక: నః =
మనకు, కతరత్ = (చేయుటకు) ఏది, గరీయః = శ్రేష్టమో,
చ ఏతత్ =
దీనినికూడ, న విద్మః =ఎఱుగను, జయేమ యద్వా = (మనము) జయించెదమో, (లేక) నః = మనలను,
జయేయుః
యదివా = (వారే) జయించెదరో? యాన్ = ఎవరిని, హత్వా = చంపి,
న
జిజీవిషామః = జీవింప గోరమో, తే ధార్తరాష్ట్రా ఏవ = అట్టి
ధృతరాష్ట్రుని సంబంధులగు భీష్మాదులే,
ప్రముఖే =
ఎదుట, అవస్థితాః = నిలిచియున్నారు.
భావము: (కృష్ణా!!)
ఎవరిని చంపాక జీవించడానికి ఇష్టపడమో, ఆ ధృతరాష్ట్రనందనులే
ఎదురుగా నిలబడి ఉన్నారు. ఈ యుద్ధంలో వారి గెలుపు మేలా? లేక
మా గెలుపు మేల? అన్నది నిర్ణయింప లేకున్నాను.
వ్యాఖ్యలు:
1. అర్జునుడు ఇంకా కారణాలు వెతుకుతున్నాడు. అర్జునుడు
వివశుడై సంయమనము కోలుపోయి, తానెందుకు ఆ సమయంలో అక్కడ
(యుద్ధరంగంలో) ఏ ఫలితమునాసించి వచ్చెనో అది మరచి మాట్లాడం అతని మానసిక స్థితిని
స్పష్టంగా తెలియజేయుచున్నది.
2. అనేక సందర్భాల్లో, పరస్పరం విరుద్ధమైన భావాలు
మనిషిని లాగుతూ ఉంటాయి. వాటిలోంచి సవ్యమైన దారిని ఎంచుకోవడమే విజ్ఞత. అక్కడే
చాలామంది చతికిలబడతారు
3. క్రింది అన్నమయ్య కీర్తన అర్జునుడి మనోభావాలను చక్కగా
ప్రతిబింబిస్తోంది. (with translation of the
central idea)
భావము: ఒక్కొక్కవేళ కలిమిలేములు ఈ జీవితమును కొండను ఎత్తినట్లు అనిపింపచేస్తాయి. వేగించుతాయి. ఒక్కొక్కవేళ ఎల్లలే లేని చీకటిలా దుఃఖములు వూరట నివ్వక కమ్ముకొంటాయి.
Meaning: Sometimes, the wealth or lack of it, make life seem
like lifting a hill. Such a man feels like being inside a frying pan.
Sometimes, sorrows surround him like an endless darkness.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి