|| క్లైబ్యం
మాస్మగమః పార్థ!
నైతత్ త్వయ్యు పపద్యతే|
క్షుద్రం హృదయ దౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరంతప! ||(2-3)||
టీక: పార్థ= అర్జునా!; క్లైబ్యమ్ =
నపుంసకత్వమును; మా, స్మ, గమః = పొంద వద్దు; ఏ త త్ = ఇవి (ఈ
పిరికితనములు); న ఉపపద్యతే = కలుగ
రాదు (తగదు); పరంతప= శత్రువులను
జయించేవాడా; క్షుద్రం= తుచ్ఛమైన; హృదయ దౌర్బల్యం=
మనసులోని పిరికితనం;
త్యక్త్వా=
త్యజించి; ఉత్తిష్ఠ= లెమ్ము.
భావము: ఓ అర్జునా!! పిరికితనమునకు
లోను కావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా! మనసులోని అధైర్యము వీడి, కార్యాచరణ కై (యుద్ధమునకై)
నడుము బిగింపుము.
వ్యాఖ్యలు:
1. వివేకానందుడికి, ఎందరో మహానుభావులకీ అత్యంత ఇష్టమైన శ్లోకమిది.
2. జాగ్రత్తగా ఆలోచిస్తే చాలామంది
నాయకుల/ప్రతినాయకుల వైఫల్యానికి వారిలో ఉండే చిన్న బలహీనతలే కారణంగా కనబడుతాయి. షేక్స్పియర్
నాటకముల లోనూ నాయకుల బలహీనతలే వైపరీత్యానికి దారి తీస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి