సంజయ ఉవాచ
శ్లో|| ఏవ ముక్త్వా హృషీకేశం
గుడాకేశః పరంతపః|
న యోత్స్య ఇతి గోవిందం
ఉక్త్వా తూష్ణీం బభూవ హ! ||(2-9)||
టీక:- పరస్తపః = శత్రువులను తపింపజేయునట్టి; గుడాకేశః = అర్జునుడు, హృషీకేశమ్ = శ్రీకృష్ణునితో; ఏవం = ఈ ప్రకారముగ; ఉక్త్వా = చెప్పి; నయోత్స్యే = యుద్ధము చేయను; ఇతి గోవిందం = (ఆ)
కృష్ణపరమాత్మతో; ఉక్త్వా = పలికి; తూష్ఠీంబభూవహ = ఊరకుండెను.
శ్లో|| తమువాచ
హృషీకేశః
ప్రహసన్నివ భారత!|
సేనయో రుభయో ర్మధ్యే
విషీదంత మిదం వచః||(2-10)||
టీక:- భారత = ఓ ధృతరాష్ట్రమహారాజా! ఉభయోః సేనయోః = రెండుసేనలయొక్క, మధ్యే = నడుమ, విషీదన్తమ్ = దుఃఖించుచున్న, తం = ఆ అర్జునుని గూర్చి, హృషీకేశః = శ్రీకృష్ణుడు, ప్రహసన్నివ =నవ్వుచున్నవానివలె, ఇదం వచః = ఈ (చెప్పబోవు) వాక్యమును, ఉవాచ = పలికెను.
భావము: సంజయుడు ఇట్లనెను: అర్జునుడు
"నేను యుద్ధమును చేయను" అని పలికి నిశ్శబ్దముగ చతికిలబడినాడు! ఉభయ సేనల మధ్య శోక సముద్రంలో ఉన్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో
ఇట్లు పలికెను
వ్యాఖ్యలు:
భగవద్గీత అధ్యయమునకు చుట్టూతా వున్న పరిస్థితులు కాదు, తీవ్రమైన పట్టుదల ముఖ్యం: భగవద్గీత ఉపదేశము ఉభయ సేనల మధ్య జరగడం గమనించతగినది. మనలో చాలామంది “ఈ తత్వ శాస్త్రములు ఆధ్యాత్మిక శాస్త్రములు అర్థం చేసుకోవడానికీ తగిన సమయం కావలెను”; “తగిన సందర్భం ఉండవలెను”; “తగిన పరిస్థితులు కావలెను”; “తగిన వాతావరణము కావలెను”; అని అభిప్రాయములు వెలిబుచ్చుతుంటారు. కానీ భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పబడింది. కాబట్టి, వీటన్నింటి కంటే లక్ష్యం పట్ల తీవ్రమైన కాంక్ష, సత్వరమే సాధించు విశ్వాసము అవసరము అని తెలియవచ్చును.
కడు నిందులో బరము గడియించవలెగాక: జాగ్రత్తగా గమనిస్తే మన జీవితమే ఒక
యుద్ధరంగము. మనమంతా ఏదో ఒక పని చేయుట లోనే ఊరట పొందుతాము. అందుకనీ నిరంతరముగా
యథార్థముగా అర్థంలేని అనేక కార్యములు కల్పించుకుని క్షణం కూడా తీరిక లేకుండా
ఉంటాం. ఈ ప్రయత్నములను ఒక మాటు ఆపి, భగవద్గీత చదువుటకు తగిన
సమయం కేటాయించి తమతమ జీవితములు సార్ధకం చేసుకోనవలెను.కు తగిన సమయం కేటాయించి తమతమ జీవితములు సార్ధకం చేసుకోనవలెను.
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి