"భగవద్గీత ఎందుకు చదువవలెను" అన్న సందేహం తప్పక కలగవలెను. భగవద్గీత హిందూ దేవుళ్ల గురించి కానీ; ఆచార వ్యవహారాల గురించి కానీ; దైవము అన్నది ఏమిటో కానీ వివరించదు. కాబట్టి ఇది ఒక మతగ్రంథము కాదు. భగవద్గీతను క్షుణ్ణంగా పరిశీలిస్తే మనిషికి అతను ఉన్న పరిస్థితులకు వాతావరణమునకు మధ్యగల సంబంధమును భగవద్గీత వివరించుటకు ప్రయత్నము చేయును.
"అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే" (13-13) అని భగవద్గీతలో చెప్పి ఆ సత్యమును లేదా దైవమును ఇదమిత్థముగా నిర్ణయించుటకు మానవునికి శక్తి సరిపోదు అని సూటిగా స్పష్టముగా చెప్పారు. అలాగే భగవద్గీత 13-30లో "అకర్తారం స పశ్యతి" అని ఏమి చేయక ఊరకుండుటను ధ్యానమార్గముగా వివరించిరి.
ఏమి చేయకుండుట అనగా సన్యాసం స్వీకరించుట అనగా ఏ కార్యకలాపములు జీవ క్రియలు మొత్తం గాలి పీల్చుట వదులుటతో సహా అన్నిటినీ నూటికి నూరు శాతము త్యజించుట అనుకోవచ్చు. ప్రకృతియందు సంభవించు క్రియలను ప్రకృతితోనే వదిలి ఉండుటను సన్యాసము అనిరి.
ఏ రకముగా చూచినా భగవద్గీత ఒక విప్లవాత్మకమైన ధోరణిలో మానవునికి తాను చేయవలసిన కార్యములను ఉద్దేశించుచున్నది. మీలో ఎవరికైనా భగవద్గీత ఒక మత గ్రంధమని భావన ఉన్న ఎడల పైన చెప్పిన రెండు ఉదాహరణల ఆధారంతో మీయొక్క అవగాహనను పునః పరిశీలించుకోవాలి.
భగవద్గీత బోధించుట ఉద్దేశించిన గ్రంధం కాదు. ఎవరికివారు తమను తాము పునర్దర్శించుకున్నట్లు చేయు ఒక అసమానమైన గ్రంథము. “గీత చాల గొప్పది సర్” “చాలా విషయాలు చెప్పారు సర్” “గీతను 60 ఏళ్లు వచ్చిన తర్వాత చదువుతాను సార్” “సంస్కృతంలో ఉంది, తెలుగులో వుంటే చదువుకునే వాణ్ణి సర్” అను మిషలను ప్రక్కనపెట్టి భగవద్గీతను మీకు మీరే చదివి తెలుసుకోండి.
ఇకపోతే మానవునికి అతడు ఉన్న వాతావరణానికి ఎలాంటి సంబంధం వుందన్న సందేహం వస్తుంది. మాయలు, మంత్రాలు, కపటాలు కాకుండా వాస్తవంగా జీవులకుఁ ఈ భూమికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం మీలో ఎవరైనా ప్రత్యక్షంగా చూశారా? చూసి ఉండకపోవచ్చు. కానీ ఎక్కడో దీనికి మనకు సంబంధం ఉంది అని అనిపిస్తుంది. అనిపించడం వేరు ఉండడం వేరు కాబట్టి ఉన్నది అని నిరూపించుటకు మన వద్ద పెద్దగా సాక్ష్యాధారాలు ఉండవు.
అందుకోసమే నేను మీతో ఒక దృగ్విషయంను పంచుకోదలిచాను గత శతాబ్దం మొదట్లో
తోడేళ్ళు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అమెరికా సంయుక్త రాష్ట్రములో ‘తోడేళ్ల బెడదతో పెంపుడు జంతువుల నాశనమైపోతున్నాయి’ అని అక్కడి ప్రజలు తోడేళ్ళని తుపాకులతో కాల్చేసి చంపేసారు. అప్పుడు ఆ వనములోని జింకలకు హద్దు లేకుండా పోయింది.
అవి విజృంభించి కనపడిన ఆకుపచ్చని ఆకులన్నీ తినేశాయి. ఫలితంగా
ఆ ప్రాంతం ఎడారిలా మారిపోయింది. అక్కడ వాళ్ళు ‘జింకల సంతానోత్పత్తిని నియంత్రించుటకు’ అనేక
ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అనేక పర్యాయములు
చేపట్టినా కార్యక్రమాలు వీగిపోయాయి.
ఫలితంగా అది మరుభూమిని తలపించింది. ఆ సమయంలో 1995లో శాస్త్రవేత్తలు 25 తోడేళ్ళను, అయ్యా గమనించండి కేవలం 25 తోడేళ్ళు మాత్రమే ప్రవేశపెట్టబడినవి. తోడేళ్ళు వస్తూనే జింకలు మైదాన భూములను వదిలి ఎత్తయిన ప్రదేశాల్లో మాత్రమే తిరగడం మొదలుపెట్టాయి. అవి పట్టుబడే పట్టుబడేందుకు ఆస్కారమున్న ప్రదేశాల్ని అవి జాగ్రత్తపడి వదిలి పెట్టేశాయి. ఫలితంగా అక్కడ ఉన్న మొక్కలకు చిగుళ్లు వచ్చి, మొక్కలు; మొక్కలతో పాటు చెట్లు; చెట్లతో పాటు పక్షులు; పక్షులతో పాటు చిన్నా చితక జీవులు; ఆ జీవులను తీనుటకు పెద్ద జీవులు ఈ రకంగా చూస్తూ చూస్తుండగానే 15 సంవత్సరముల లోపల అది అరణ్యము తన పూర్వవైభవం సంతరించుకుంది. కేవలం 25 తోడేళ్లతో మాత్రమే ఈ పని సాధ్యమైంది.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఆ వన్యము గుండా ప్రవహి ప్రవహించుచున్న నదులు; నీటిలో నివసించు చిన్న చిన్న ప్రాణులు చిన్న ఆనకట్టలు కట్టడంతో నీరు పొంగి గట్టును దాటుకొని వెళ్ళి కొన్ని చిన్న కొన్ని పెద్ద మడుగులు ఏర్పడ్డాయి వన్యప్రాణులకు ప్రవహిస్తున్న నీటిలో కంటే మడుగులలోంచి నీళ్లు తాగడం సులువు. ఈ రకంగా కేవలం 25 తోడేళ్ళ సహాయంతో నదులు అక్కడి నదులు తమ పరివాహక ప్రాంతాన్ని సుస్థిరం చేసుకున్నాయి దానితో చక్కని చిక్కని వనం ఏర్పడింది.
ఈ ఉదాహరణ మనం ఎందుకు
చెప్పుకుంటున్నాం అంటే వాతావరణంకు అక్కడి జీవులకు అక్కడి నదులకు అక్కడి రాళ్లకు
మధ్య గల విడదీయరాని సంబంధం ఈ దృగ్విషయం నిరూపించుచున్నది.
అంతదాకా ఎందుకు, 1957 ప్రాంతంలో చైనాలో పిచ్చుకలు మానవులకు చెందవలసిన ఆహారం తినేస్తున్నాయి అన్న అపోహలతో, “మావో”గారి అనుజ్ఞతో అతి విస్తారమైన ఒక ఉద్యమంలో, కొన్ని నెలల వ్యవధిలో ఆ దేశంలో గల వందల కోట్ల పిచ్చుకల్ని చంపేసారు. ఆ తర్వాత పిచ్చుకలు మాయమవడం తోటి మిడతలు, అనేక చిన్న చిన్న పురుగులు విజృంభించి ఆహారధాన్యాలన్నింటినీ మితి మీరిగా తినివేశాయి ఫలితంగా తరువాతి సంవత్సరంలో కోట్లాదిమంది ఆహారం లేక మరణించారు. మానవుని హస్వ దృష్టికి ఈ రెండు ఉదాహరణలు తార్కాణము.
అటుపిమ్మట మనకు మన చుట్టూ ఉన్న పరిస్థితులను, వాటిని నియంత్రించు అనేకానేక విషయములను పరిశీలించిన, అవి ఒకదానితో ఒకటి లంకెపడి దాదాపు నిర్ధారించలేనివే అని తెలుస్తోంది. ఆ విధంగా మానవుడు ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. దానితో తన సహజ స్థితి నుండి పూర్తి కృత్రిమమైన స్థితికి జారుకున్నాడు. ఈ కోణం నుంచి చూస్తే ప్రపంచంలో అత్యంత సున్నితమైన, తీక్షణమైన ఆద్యంతము విస్మయము కలిగించు మొట్టమొదటి ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రం భగవద్గీత అనుకోవచ్చు.
భగవద్గీత మానవుని తనకు తన చుట్టూ ఉన్న పరిస్థితులకు మధ్య సంబంధాన్ని వెతక మంటుంది. “అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే” అని చెప్పి జీవులకు, మనం అనుకుంటున్న నిర్జీవులకు తత్వం ఒకటే అని సెలవిచ్చారు. కానీ ఆ సంబంధాన్ని తెలియుట ఎట్లు?
మనం ఉన్న ఇప్పటి స్థితిలో సహజత్వానికి దూరమై సత్యము గ్రహించలేకున్నాము దీనికి మన సహజ స్థితికి చేరుకోవడం తప్ప వేరు మార్గం లేదు. కాబట్టి మనము చేయవలసినది అసహజమైన విషయంలన్నిటిని త్యజించడమే భగవద్గీత బోధన.
అయితే, ఇది చెప్పినంత సులభము కాదు. ముందుగా మనమున్న అసహజ స్థితిని నిష్పక్షముగా గుర్తించవలెను. సహజముగా నటించుటకు అలవాటుపడిన మనకు సహజము అత్యంత కఠినమైన విషయమే. ఈ అసహజమును గుర్తించుటకు చేయు త్యాగమే యజ్ఞమని చెప్పబడినది.
ఆ సహజ స్థితిని చేరుకున్నవారు
కొందరే. ఆ కొద్ది మంది కూడా తాము ఏ రకముగా చేరినది చెప్పలేక పోయిరి. అందుకే ఈ యోగ
మార్గము మనవంటి సామాన్యులకు అప్రత్యక్షము. కానీ, అచంచల
విశ్వాసముతోను, కఠినమైన క్రమశిక్షణతోను, సునిశిత పరిశీలనలతోను, తాళిమితోను, అసహనము లేని ప్రయత్నముతోనూ దీనిని సాధించవచ్చని
భగవద్గీత ఆదేశము. కావున మనవద్ద తగినన్ని సాక్ష్యాధారాలు వచ్చే వరకు వేచిచూచుటకు
సమయము లేదు. మనకివ్వ బడిన ఈ అవకాశము కొలది దినములు మాత్రమే. అందుకే త్వర
పడవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి