టీక: - పార్ధ = ఓ అర్జునుడా!; యః = ఎవడు; ఏనమ్ = ఇది, ఈ ఆత్మను; అజమ్ = పుట్టుకలేనివానిగను, అవ్యయమ్ = క్షయములేనివానిగను, మార్పుచెందనిదిగను; అవినాశినమ్ = నాశరహితునిగను; నిత్యమ్ = నిత్యునిగను, వేద = తెలిసికొనుచున్నాడో, సఃపురుషః = ఆ మనుజుడు, కథం = ఎట్లు; కమ్ = ఎవనిని; ఘాతయతి = చంపించును?; కమ్ = ఎవనిని; హన్తి = చంపును?
భావము: ఓ అర్జునా! ఈ యాత్మ నెవడు జననమరణములు లేనివానిగను, నాశరహితునిగను, నిత్యునిగను ఎఱుంగునో, అట్టి వాడెట్లు ఒకనిని చంపించగలడు, తాను చంపగలడు?
వ్యాఖ్యానము: మనం ఉన్న స్థితినుంచి ఆ శాశ్వతత్వమును స్పృశించినవాని మనఃస్థితిని ఊహించుట అసంభవం. కాబట్టీ కృష్ణులవారు ఇన్ని సార్లు ఈ శాశ్వతం అన్నదాని గుఱించి
చెప్పారేమో.
టీక:– నరః = మనుజుడు; జీర్ణాని = శిథిలములైన (చినిగిపోయిన); వాసాంసి = వస్త్రములను; విహాయ =విడిచి; అపరాణి = ఇతరములైన, వేరైన; నవాని (వాసాంసి) = క్రొత్తవస్త్రములను, యథా = ఏ ప్రకారముగ, గృహ్ణాతి = గ్రహించుచున్నాడో, స్వీకరించుచున్నాడో; తథా = ఆప్రకారముగనే; దేహీ= ఆత్మ; జీర్ణాని= శిథిలములైన, శరీరాణి = దేహములను, విహాయ = విడిచి, అన్యాని =ఇతరములైన, నవాని (శరీరాణి) క్రొత్తశరీరములను, సంయాతి = పొందుచున్నాడు.
భావము: ఎలాగైతే మానవుడు, జీర్ణమైపోయిన
పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా,
మరణ సమయములో, జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త
శరీరమును స్వీకరించును.
వ్యాఖ్యానము:
మన స్థితికి శాశ్వతమునకు లంకెలేదు: జీవము అనునది నిరంతరము సాగుచుండును అన్నది 12వ శ్లోకంలోనూ తదుపరి వివరణలలో చెప్పుకున్నాము. జీవము కొనసాగుచున్నను, పుట్టిన ప్రతి జీవికి మరణం
తప్పదు. పుట్టుక
మరియు చావుల మధ్య కాలంలో మనకు ఎఱుక జనించును. ఆ గ్రహింపు
కేవలము తాత్కాలికం. (2-28) అది మరణముతో అంత మొందును. కాబట్టి
మానవునికి ఇప్పటి స్థితిలో శాశ్వతము అన్నది తెలియుటకు అవకాశం చాలా తక్కువ.
వూహాగానము కూడదు:మరణంతో జీవితము అంతమౌను. కావున మరణం తరువాత మరియొక జీవితంతో ముడి పెట్టడం మానవులుగా మనకు సాధ్యం కాదు. పైగా దైవం యొక్క చర్యలకు భాష్యము చెప్పుట అవివేకము. మానవులకు తగని పని. అట్లని మన భాష్యము ఇంకొకరి భాష్యం కంటే గొప్పదని మిడిసిపడుట కేవలం సంతృప్తిని ఇచ్చును కానీ అది సత్యమునకు మార్గము కాదు. కాజాలదు.
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి