టీక:- భారత
= ఓ అర్జునా!; భూతాని =
ప్రాణులు ( ప్రాణుల శరీరములు);
అవ్యక్తాదీని
= ఆదియందు (పుట్టుకకు
పూర్వము) అవ్యక్తములు (అప్రకటితములు, కంటి కగపడని స్వరూపము
గలవియు); వ్యక్తమధ్యాని
= మధ్యమందు (పుట్టినపిదప) అగపడు రూపము గలవియు వ్యక్తములు ప్రకటితములు; అవ్యక్తనిధనాన్యేవ
= మరణించిన పిదప (అంతమందు) అగపడని స్వరూపము గలవియే (భవన్తి = అగుచున్నవి); తత్ర = ఆ
విషయమున; (ఇక)
పరిదేవనా = దుఃఖము;
కా= ఏల?
భావము: అర్జునా! ప్రాణులన్నియు
పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు (అవ్యక్తములు). మరణానంతరం కూడా
అవ్యక్తములే. ఈ జనన మరణాల మధ్య మాత్రమే అవి ప్రకటితములు (ఇంద్రియ గోచరములు) అగుచున్నవి.
ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.
వ్యాఖ్యానము:
మిడిమిడి జ్ఞానము: మనకు తెలిసినది మొత్తం కధలో చిన్న భాగం మాత్రమే. మనమెక్కడ నుంచి వచ్చామో, ఎక్కడకు పోయెదమో కూడా తెలియదు అని ఈ శ్లోకం యొక్క భావము. ఈ జీవితం ఒక మజిలీ మాత్రమే. మొత్తం తెలియకుండా, తెలిసిన చిన్ని భాగము గురించి విచారించుట అవివేకమని సూచించారు. విజ్ఞులు (జీవం పుట్టిన మొదలు నుంచి ఇప్పటి వరకు) ఎఱుగుటచేత దుఃఖం పొందరు అని అంతర్లీన భావము.
ఆకృతి వికృతి: ఉదాహరణకు ఇసుక తీసుకోండి. దానికి ఒక ఆకృతి వుండదు. అది ఒక భవనం క్రింద రూపాంతరము చెందినప్పుడు ఆకృతి ఉండును. తిరిగి ఆ భవనం కూల్చివేసిన తర్వాత మళ్లీ ఇసుక క్రింద మారిపోతుంది.
లేని దానికి అర్రులు చాస్తాం: అదే రకంగా ప్రకృతి నుంచి పుట్టిన మనిషి తను ఎక్కడ నుండి వచ్చాడో, దేహము జీర్ణించిన తర్వాత ఎక్కడికి పోవునో తెలియలేడు. మిలియన్ల సంవత్సరాల జీవ పరిణామ క్రియలలో పుట్టిన మనిషి తన పూర్తి అస్తిత్వమును ఒక ఆపిల్ పండు చేతిలో ఉంచుకొని చూసినట్టుగా, తన పిడికిలిలో పెట్టుకోవాలని చూస్తాడు. ఆ పిడికిలి, ఆ ఆపిల్ పండు, ఆ ఇసుక, ఆ వ్యక్తికూడా అస్తిత్వం లేనివారే. తాత్కాలిక మైనవే. లేనిదాని కోసం వెతకడమే అజ్ఞానం.
కావున, "నేను అను తాత్కాలిక స్థితి నుండి దేవునితో అనగా శాశ్వత స్థితితో కలియుటకు చేయు నా ప్రయాస వ్యర్థమైన ప్రయాణం" అని తెలియవలె.
అగ్నిగుండంలోని సత్యం: దైవమును అంటిపెట్టుకొని వుండాలనే ఉద్దేశ్యంతో. చాలామంది యోగమును కోరుకున్నప్పటికీ, ఆ అగ్ని పరీక్షలో, పలువురు వెనక్కు తగ్గి, మామూలు జీవితానికి తిరిగి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ అగ్నిగుండంలో దాగివున్న సత్యాన్ని భయపడకుండా అనుసరించాలని సూచిస్తున్నారు.
దీనిని తదుపరి శ్లోకముతో కలిపి చూడవలసినదిగా మనవి.
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి