టీక:- సర్వస్య = సమస్త ప్రానులందును; దేహే = దేహమునందు; అయం దేహీ = ఈ ఆత్మ; నిత్యం= ఎల్లప్పుడును; అవధ్య = చంపబడనివాడు; తస్మాత్ = అందువలన; సర్వాణి = సమస్తములైన; భూతాని = ప్రాణుల గురించి; త్వం = నీవు; శోచితుమర్హసి = దుఃఖించతగదు.
భావము: అర్జునా! సమస్త
ప్రాణికోట్ల దేహములందు వసించి ఉన్న ఈ ఆత్మ
ఎన్నడును చంపబడడు. కావున నీవు ఏ ప్రాణిని గూర్చి
శోకించ తగదు.
శ్లో|| స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ।
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ||(2-31)||
టీక:- చ = మరియు; స్వధర్మమ్=క్షత్రీయ ధర్మమును; ఆవేక్ష్య అపి = చూచియైనను;
వికంపితుమ్
= చలించుటకు; న అర్హసి = తగవు;
క్షత్రియస్య=
క్షత్రీయునకు; ధర్మ్యాత్= ధర్మయుతమైన; యుద్ధాత్= యుద్ధము కంటే;
అన్యత్=
ఇతరమైన; శ్రేయః=మేలు; న విద్యతే హి = లేదు గదా.
భావము: అర్జునా! ఓ అర్జునా స్వకీయమగు
క్షత్రియ ధర్మం విచారించుకున్నా యుద్ధమునకు వెనుదీయుట నీకు సరియైనది కాదు. ఎలయనిన
క్షత్రియునకు ధర్మ యుద్ధం కంటే శ్రేయస్కరమైనది మరొకటి లేదు కదా!
శ్లో|| యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ ।
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ||(2-32)||
టీక:- పార్థ
= అర్జున; యదృచ్ఛయా =
కోరకుండానే, యాదృచ్ఛికముగా; చో ఉపపన్నం = సంప్రప్తమైనదియు; అపావృతమ్ =
తెరువబడినది; స్వర్గద్వారమ్ = స్వర్గద్వారమును; ఈ దృశమ్ =
ఇట్టి; యుద్ధమ్ =
యుద్ధమును; (యే); క్షత్రియాః
= ఏ క్షత్రియులు;
లభంతే = పొందుచున్నారో; తే = వారు; సుఖినః =
ధన్యులు.
భావము: అర్జునా! అప్రయత్నముగానే లభించినట్టిదియు, తెరువబడిన స్వర్గ ద్వారం వంటిదియు అగు ఇట్టి యుద్ధమును ఏ క్షత్రియులు పొందుతున్నారో వారు వాస్తవముగా ధన్యులే.
శ్లో|| అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ||(2-33)||
టీక:- అథ =
ఇక; త్వమ్= నీవు; ఇమమ్=ఈ; ధర్మ్యమ్=
ధర్మయుక్తమైన; సంగ్రామం =
యుద్ధమును; న కరిష్యసి
= చేయ కుందువేని;
తతః =
అందువలన; స్వధర్మమ్= స్వధర్మమును; కీర్తించ =
కీర్తిని; హిత్వా=
విడిచి; పాపమ్=
పాపమును; ఆవాప్స్యసి
= పొందగలవు.
భావము: అర్జునా! ఇక
నీవు ధర్మయుక్తముగా ఈ యుద్ధము చేయకుందువేని దానిచే నీవు స్వధర్మమును
అనాదరించినవాడవై కీర్తిని పోగొట్టుకుని పాపమును పొందగలవు.
శ్లో|| అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ||(2-34)||
టీక:-
అపిచ= మరియును; భూతాని
=ప్రాణులు (జనులు);
తే = నీ
యొక్క; అవ్యయామ్ =
చిర కాలము మాయ కుండునట్టి;
అకీర్తిం =
అపకీర్తిని; కథయిష్యంతి
= కథలుగా చెప్పుకొనగలరు;
సంభావితస్య
= గౌరవముగలవానికి;
అకీర్తిః =
అపకీర్తి; మరణాత్=
చావు కంటెనూ; అతిరిచ్యతే
= అధికమైనదగుచున్నది.
భావము: అర్జునా!
మరియు లోకులు నీ యొక్క అపకీర్తిని చిరకాలం వరకు చెప్పుకొనుచుందురు. గౌరవంగా బతికిన
వానికి అపకీర్తి చావు కంటేను అధికమైనది.
శ్లో|| భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ।
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||(2-35)||
టీక:- చ =
మఱియు; యేషాం=
ఎవరిలో; త్వం= నీవు; బహుమతః
భూత్వా = గౌరవింపబడినవాడవై;
లాఘవమ్ =
చులకనను (అగౌరవమును);
మహారథాః =
మహారథులు; త్వాం =
నిన్ను; రణాత్ =
రణము నుండి; భయాత్= భయము
వలన; ఉపరతం=
మఱలినవానిగా; మంస్యంతే =
తలతురు.ద్రణాదుపరతం మహారథాః ।
చ యాస్యసి
భావము: అర్జునా!
మరియు ఇంతవరకు ఏ మహారధులు నిన్ను గొప్ప విలుకానిగా భావించుచున్నారో వారే నిన్నిప్పుడు
చులకనగా చూచి భయముచేఁ యుద్ధం నుండి మరలిన వానిగా తలంతురు.
శ్లో|| అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః ।
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ||(2-36)||
టీక:- తవ=
నీ యొక్క; అహితాః =
శత్రువులు; తవ= నీ
యొక్క; సామర్థ్యం =
సామర్థ్యమును; నిందంతః= దూషించువారై; బహూన్ =
అనేకములైన; అవాచ్యవాదాంశ్చ
= అనరాని మాటలు కూడా;
వదిష్యంతి=
పలుకగలరు; తతః=
అంతకంటే; దుఃఖతరం =
దుఃఖతరమైనది; కిమ్ ను=
ఏమి కలదు?
భావము: అర్జునా!
అంతే కాక ఆ శత్రువులు నీయొక్క నైపుణ్యమును సామర్థ్యమును దూషించుచు, పెక్కు
దుర్భాషలను కూడా పలుకగలరు. దానిని మించిన దుఃఖ మేమిగలదు?
శ్లో|| హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్ ।
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ||(2-37)||
టీక:-
కౌంతేయ = ఓ అర్జున!;
హతో వా=
మరణించినచో; స్వర్గమ్=
స్వర్గమును; ప్రాప్స్యసి
= పొందగలవు; జిత్వా వా =
జయించినచో; మహీమ్ =
రాజ్యమును; భోక్షసే =
అనుభవించుదువు; తస్మాత్=
అందువలన; యుద్ధాయ=
యుద్ధము చేయుటకు;
కృతనిశ్చయః=
కృతనిశ్చయుడవై; ఉత్తిష్ఠ=
లెమ్ము.
భావము: అర్జునా!
అర్జున ఒకవేళ నీవే ధర్మయుద్ధమందు శత్రువులచే చంపబడినచో స్వర్గమును పొందుదువు.
అట్లుకాక నీవే జయించినచో ఈ భూలోకరాజ్యమును అనుభవించెదవు. (ఈ ప్రకారముగా రెండు విధముల మేలే జరుగును.) కావున
లెమ్ము! యుద్ధమునకు సంసిద్ధుఁడవు కమ్ము!
x-x-x-x