ప్రథమోధ్యాయః
అర్జున ఉవాచ|
శ్లో|| న కాంక్షే విజయం కృష్ణ!
న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద!
కిం భోగై ర్జీవితేన వా || (1-32)
శ్లో|| యేషామర్థే కాంక్షితం నో
రాజ్యం భోగా స్సుఖాని చ |
త ఇమేऽవస్థితా యుద్ధే
ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ || (1-33)
భావం: అర్జునుడు ఇట్లనెను "కృష్ణా ! యుద్ధవిజయం మీద, రాజ్యసుఖాలమీద నాకు ఆసక్తిలేదు. రాజ్యభోగాలతో కూడిన జీవితం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎవరికోసం రాజ్యం, భోగం, సుఖం కోరుతున్నామో వాళ్ళంతా---గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరదులు, ఇతర బంధువులూ---ధన ప్రాణాల మీద ఆశవదలి ఈ రణరంగంలోనే ఉన్నారు"
వ్యాఖ్యలు:
1. ప్రపంచంలో రాజ్యం, భోగం, సుఖం మొదలైనవన్నీ సాపేక్షము. ఏ బంధువులూ లేకపోయిననాడు (యుధ్దం తరువాత) రాజ్యం, భోగం, సుఖం ఎవరితోను పోల్చుకోలేము. అపుడు అవన్నీ వ్యర్ధం అనే విషయం తెలియజేస్తున్నాడు.
2. ఈ ధనమూ, రాజ్యమూ, ప్రతిష్టా ప్రాణం కన్నా ఎక్కువ కావని తెలిసీ, మనిషి వాటికోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమౌతున్నాడు. గత ఐదు వేల ఏళ్లలో వేలాది యుద్ధాలు జరిగాయి. ఏ యుద్ధం వల్లనైనా సామాన్యులకు ఏదైనా జరిగింది అంటే వారి జీవితం మరింత దుర్భరమైంది. కానీ ఆనాటి దండనీతి/రణనీతి ఇంకా ఈనాటికీ కొనసాగించడం మానవజాతి అనాగరికతకు చిహ్నం.
3. ఇదే పంథాలో ముందుకెళితే, మానవజాతి గత ఐదు వేల సంవత్సరాలలో ఏమాత్రం పాఠాలు నేర్వలేదని చెప్పుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి