ప్రథమోధ్యాయః
సంజయ ఉవాచ
శ్లో|| ఏవ ముక్త్వా೭ర్జున స్సంఖ్యే
రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం
శోకసంవిగ్నమానసః || (1-47)
భావము: సంజయుడు కురుక్షేత్రంలోని పరిస్థితిని తెలుపుతూ "అర్జునుడు తాను యుద్ధం నుండి వైదొలగడానికి అనేక కారణాలను వివరించుతూ మాట్లాడిన తరువాత, శోకసంవిజ్ఞమానుడై యుద్ధ భూమి యందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగమున చతికిలబడెను" అన్నాడు.
వ్యాఖ్యలు:
1. అర్జునుడు సమర్ధుడై కూడా, తనవారితోనే చేయవలసిన ఘోర యుద్ధము, దాని పర్యవసానాలు తలచుకొని, ఆయుధములు ప్రక్కన పెట్టి, దుఃఖభారము మదిని కప్పుగొనగా, కర్తవ్యము నిర్ణయింప లేక చతికిలబడెను
2. ఇటువంటి పరిస్థితి షేక్స్పియర్ హామ్లెట్'కి కూడా కలుగుతుంది. తాను చేయవలసిన కార్యములు నిర్ణయింపలేక తడబడుతాడు. తన కర్తవ్యం నిర్ణయించుట యందు అధిక సమయం వృధా చేసుకుంటాడు.